వైఎస్ వివేకా హత్య కేసు: రెండో రోజూ సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  రెండో రోజున  సీబీఐ విచారణకు హాజరయ్యారు.

 YS vivekananda Reddy  Murder Case: Kadapa  MP  YS   Avinash Reddy  Attends  Cbi  Probe  second day


హైద్రాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  గురువారంనాడు  సీబీఐ విచారణకు  హాజరయ్యారు నిన్న  కూడా  వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ విచారించింది.   వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  అరెస్ట్  చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి,  వైఎస్ భాస్కర్ రెడ్డిలను  కూడ  సీబీఐ విచారిస్తుంది. 

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది . ఆరు రోజుల పాటు  సీబీఐ కస్టడీకి  కోర్టు  అనుమతిని  ఇచ్చింది. ఈ ఇద్దరిని సీబీఐ  కస్టడీలోకి తీసుకోవడం  ఇవాళ్టితో రెండో రోజుకు  చేరుకుంది.   రెండోరోజున  వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  సీబీఐ విచారించనుంది. 
 మరో వైపు ఈ కేసులో  సీబీఐ సేకరించిన ఆధారాల మేరకు  ఈ ముగ్గురిని ప్రశ్నించనున్నారు.  వైఎస్  భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను  నిన్న  ఐదు గంటల పాటు   సీబీఐ  ప్రశ్నించింది.  కానీ  వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం ఎనిమిది గంటల పాటు విచారించింది.

also read:వైఎస్ వివేకా హత్య: ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ, రూ. 40 కోట్ల డీల్ పై ఆరా

వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకు  ముందు  చోటు  చేసుకున్న పరిణామాలు, హత్య  తర్వాత ఆధారాలు చెరిపివేసేందుకు తీసుకున్న చర్యలపై  కూడా    సీబీఐ   ఈ ముగ్గుురిని  ప్రశ్నించనుందని సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు అంశానికి  సంబంధించి దారితీసిన  ప్రధాన కారణాలపై   సీబీఐ  ఆరా తీయనుంది.  అంతేకాదు  ఆర్ధిక లావాదేవీలపై  కూడా  సీబీఐ  కేంద్రీకరించినట్టుగా  సమాచారం. 

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను   ఆరు రోజుల పాటు సీబీఐ  విచారించనుంది.  మరో వైపు వైఎస్ అవినాష్ రెడ్డి ని ఈనెల  25వ తేదీ వరకు  సీబీఐ విచారించే అవకాశం ఉంది. ఈ నెల  30వ తేదీలోపుగా  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విచారణను పూర్తి  చేయాలని సుప్రీంకోర్టు  సీబీఐని ఆదేశించింది.  ఈ లోపుగా  కేసు దర్యాప్తును  పూర్తి  చేయాలని   సీబీఐ  అధికారులు ప్రయత్నిస్తున్నారు.2019  మార్చి  14వ తేదీన  రాత్రి  పులివెందులలో  వైఎస్  వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు.  ఈ హత్య కేసును  సీబీఐ  విచారిస్తుంది.  ఏపీ హైకోర్టు  సీబీఐ   విచారణకు  ఆదేశించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios