అమరావతి: మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తనకు కొందరిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎవరిపై అనుమానాలున్నాయో ఆమె చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఆమె ఓ జాబితాను ఆమె హైకోర్టు సమర్పించారు. 

సునీత చెప్పిన జాబితాలోనే పేర్లు....

వాచ్ మన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఎఎస్ఐ రామకృష్ణా రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

ఘటనా స్థలంో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తమకు కొందరిపై అనుమానాలున్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు. 

Also Read: వివేకా హత్య కేసులో ట్విస్ట్... మరో పిటిషన్ వేసిన కుమార్తె సునీత.

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే ఆయన సతీమమి సౌభాగ్యమ్మ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణ తుది దశలో ఉన్నందున సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వం ఇదివరకే కోర్టుకు తెలిపింది. ఏజీ అందుబాటులో లేనందున వివరాలను సమర్పించడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాది గడువు కోరారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. 

గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని కూడా సునీత గుర్తు చేశారు .గవర్నర్ ను కలిిస కూడా తాము విజ్ఞప్తి చేశామని చెప్పారు. కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని, తమకు న్యాయం చేయాలని అన్నారు. 

Also Read: వైఎస్ వివేకా హత్య: బాబుకు హైకోర్టు నోటీసులు