తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న దస్తగిరి, రంగన్నలకు భద్రత కల్పిస్తున్నట్టుగా పోలీసుశాఖ సోమవారం కోర్టుకు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న దస్తగిరి, రంగన్నలకు భద్రత కల్పిస్తున్నట్టుగా పోలీసుశాఖ సోమవారం కడప కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దస్తగిరి, రంగన్నలకు.. 1+1 గన్ మెన్‌లతో కూడిన భద్రత కల్పించామని తెలియజేసింది. 

ఇక, వివేకా హత్య కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు భద్రత కల్పించాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో సీబీఐ.. ఈ నెల ప్రారంభంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విట్నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌-2018 మేరకు సాక్షులకు రక్షణ కల్పించాలని కోరింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి భద్రత కల్పించారో తెలియజేయాలని కడప జిల్లా  పోలీసు శాఖకు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే పోలీసు శాఖ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది. 

మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి  బెయిల్ పిటిషన్ విచారణలో  కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ  పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  నిందితుడిగా ఉన్న Devireddy siva shankar Reddy తనకు bail ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు Ap High Court విచారణ జరిగింది. 

అయితే ఈ పిటిషన్ విచారణ సమయంలో తాను కూడా ఈ విషయంలో ఇంప్లీడ్ అవుతానని వైఎస్  వివేకానందరెడ్డి కూతురు Sunitha Reddy పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీండ్ అవుతానని సునీతారెడ్డి హైకోర్టును కోరారు. అయితే ఏ నిబంధన కింద  ఇంప్లీడ్ అవుతారని ఉన్నత న్యాయస్థానం సునీతారెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ విషయమై సమగ్ర వివరాలతో  హైకోర్టులో సమగ్ర సమాచారంతో పిటిషన్ దాఖలు చేస్తానని సునీతా రెడ్డి తరపు  న్యాయవాది తెలిపారు. వాదనల అనంతరం శివశంకర్ రెడ్డి బెయిల్, సునీత పిటీషన్‌లపై హైకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.

ఇక, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 2021 ఆగస్ట్ 30న దస్తగిరి.. సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు.