మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుతం సీఎం జగన్ కు సొంత బాబాయ్ మాత్రమే కాదు మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ (ys jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు (ys vivekananda reddy murder) రోజుకో ములుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి (erra gangireddy) విచారణ చేపడుతున్న సిబిఐపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురయిన వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి (dastagiri)ని అప్రూవల్ గా మార్చి క్షమాభిక్ష పెట్టాడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఇవాళ (మంగళవారం) హైకోర్టు (ap high court) విచారణ జరిపింది.
పిటిషనర్ గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించారు. దస్తగిరిని అప్రూవల్ గా మార్చి అరెస్టు చేయకుండా సిబిఐ వదిలిపెట్టిందని తెలిపారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ (CBI) సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.
ఇటీవల వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎర్ర గంగిరెడ్డి పేరును కూడా దస్తగిరి బయటపెట్టాడు. దీంతో తనను కావాలనే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.
వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట వున్నారు. అయితే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని... వెంటనే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని ఇటీవల సిబిఐ కోర్టు కడప కోర్టును కోరింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సిబిఐ వాదనతో ఏకీభవించలేదు. దీంతో బెయిల్ కొనసాగుతుందంటూ తీర్పునిచ్చి గంగిరెడ్డికి ఊరటనిచ్చింది.
ఇదిలావుంటే ఇటీవల వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను ఆయన డ్రైవర్ దస్తగిరి సిబిఐ అధికారులకు తెలిపెతూ ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో చాలామంది పెద్దతలకాయల పేర్లున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి (shankar redy) తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు... అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీనిచ్చిట్టు దస్తగిరి పేర్కొన్నాడు.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
read more నన్ను కావాలనే వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు..: హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
