వివేకా హత్య కేసు.. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సునీల్‌కు మధ్యంతర బెయిల్..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన తండ్రి మృతిచెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సునీల్ యాదవ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ క్రమంలోనే సునీల్ యాదవ్ అభ్యర్థనపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు శని, ఆదివారాల్లో ఎస్కార్ట్‌తో పులివెందులకు వెళ్లేందుకు సునీల్ యాదవ్‌కు అనుమతించింది. ఈ నెల 17,18 తేదీల్లో కూడా పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పులివెందుల వెళ్లే క్రమంలో.. ఎస్కార్ట్ భద్రత ఖర్చును సునీల్ యాదవ్ భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఇక, తనకు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వాలన్న సునీల్ యాదవ్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే సునీల్ యాదవ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన సీబీఐ.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసింది.