హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని తెలిపారు. 

రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయని చెప్తూ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు వైఎస్ జగన్.