ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 8.30 గంటలకల్లా పాదయాత్రకు సిద్దమవుతున్నారు. మొదట వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళులర్పిస్తారు. 9 గంటలకల్లా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అభిమానులు, పార్టీ నేతలు, శ్రేణులు, ప్రజాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుండి పాదయాత్ర మొదలవుతుంది. మారుతీనగర్ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలై వీరన్నగుట్ట కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుండి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు. రాత్రి విడిది కోసం అవసరమైన టెంట్లను పార్టీ నేతలు ఏర్పాటు చేసారు. తన కోసం వచ్చిన వారితో మాట్లాడుతారు. ప్రతీ రోజు ఉదయం  7 కిలోమీటర్లు, సాయంత్రం మళ్ళీ 7 కిలోమీటర్లు నడక సాగేలా ప్లాన్ వేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఇక్కడే బస చేస్తారు.