ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45గం.లకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరిస్తారు. 

టెర్మినల్ భవనం వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు. 12.35 గం.లకు విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇండిగో సంస్థ రెండేళ్ల పాటు కర్నూలు నుంచి బెంగళురు, చెన్నై, విశాఖ నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. 

బెంగళూరు నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర ఆదివారాల్లో ఉదయం 9.05 గం.లకు బయలుదేరరి 10.10 గం.లకు కర్నూలు చేరుతుంది. తిరిగి అదేరోజు మధ్యాహ్నం 3.15 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 4.25 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. 

ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి 12.40 గంటలకు చేరుతుంది. అదే రోజుల్లో తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 2.55 గంటలకు కర్నూలు చేరుకోనుంది. 

చెన్నై నుంచి ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.50గం.లకు బయలుదేరి కర్నూలుకు 4.10 గం.లకు చేరుకుంటుంది. అదే రోజుల్లో కర్నూలు నుంచి అకర్నూలు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి సాయంత్రం 5.30కి చేరుతుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.