అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం నాడు  విశాఖకు వెళ్లనున్నారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జగన్ విశాఖకు వెళ్లనున్నారు.

మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు అమరావతి నుండి విశాఖపట్టణానికి వెళ్లనున్నారు.  సుమారు రెండు గంటల పాటు విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామితో జగన్ భేటీ అవుతారు. 

విశాక ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా శారదా పీఠానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా శారద పీఠానికి చేరుకొని ఆయన ఆశీస్సులు తీసుకొంటారు.

మంత్రివర్గ విస్తరణ కోసం  వైఎస్ జగన్ సీఎం  శ్రీ శారదా పీఠాధిపతి సలహాలను తీసుకొంటారని సమాచారం.  ఎన్నికలకు ముందు శారదా పీఠాధిపతిని కలిసి జగన్ ఆశీస్సులు తీసుకొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్  కూడ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో రెండు దఫాలు హోమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.