ఎంత విచిత్రమో చూడండి. మొదటిసారిగా చంద్రబాబునాయుడు, జగన్మహన్ రెడ్డి ఇద్దరూ ఒకే చోట ఉండబోతున్నారు. సంక్రాంతి పండుగకు ఇటు చంద్రబాబు అటు జగన్ ఇద్దరూ చంద్రగిరిలోనే ఉంటారు. కాకపోతే చంద్రబాబు సొంతూరు నారావారాపల్లెలో ఉంటే జగన్ మాత్రం రామచంద్రాపురం గ్రామంలో క్యాంపు వేస్తున్నారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. పోయిన నెల 28వ తేదీన జగన్ పాదయాత్ర నిమ్మితం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. శుక్రవారంతో జగన్ 60 రోజుల పాదయాత్ర పూర్తవుతోంది. సుమారు 835 కిలోమీటర్లు నడిచారు. జిల్లాలోని తంబళ్ళపల్లి, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ప్రజాసకల్పయాత్ర చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు జగన్ చంద్రగిరిలోనే పాదయాత్ర చేయనున్నారు.