రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పిన జగన్.. వీడియో వైరల్..
క్రికెట్ బ్యాట్ పట్టుకున్న రోజా ఎలా కొట్టాలో తెలియక ఇబ్బంది పడుతుంటే స్వయంగా బ్యాట్ ఎలా పట్టుకోవాలి.. బాల్ ఎలా ఎదుర్కోవాలో, క్రీజ్ లో ఎలా నిలబడాలో నేర్పించారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోనేడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. రోజాను క్రికెట్ ఆడాల్సిందిగా కోరగా తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. దీంతో కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు క్రికెట్ పాటలు నేర్పించారు జగనన్న.
క్రీడల శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ తో పాటు పాల్గొన్నారు. ఆ తర్వాత క్రికెట్ ఆడాల్సిందిగా బ్యాట్ చేతికి ఇచ్చి.. తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు జగన్. క్రికెట్ బ్యాట్ పట్టుకున్న రోజా ఎలా కొట్టాలో తెలియక ఇబ్బంది పడుతుంటే స్వయంగా బ్యాట్ ఎలా పట్టుకోవాలి.. బాల్ ఎలా ఎదుర్కోవాలో, క్రీజ్ లో ఎలా నిలబడాలో నేర్పించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Andhra Pradesh: 'ఆడుదాం ఆంధ్ర'కు గ్రామ వాలంటీర్ల సమ్మె ఎఫెక్ట్..
జగన్ సూచనల మేరకు రోజా బ్యాట్ తో బంతిని కొట్టి క్రికెట్లోకి అడుగుపెట్టినట్టు అయింది. మొదట క్రీజులో ఎలా నిలబడాలో కూడా తెలియని రోజా ఆ తర్వాత మొదటి బంతిని క్లీన్ షాట్ కొట్టారు. అది చూసిన జగన్, మిగతా మంత్రులు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. రోజా తర్వాత జగన్ కాసేపు బ్యాటింగ్ చేశారు. మొదటి బంతిని బౌండరీలు దాటించారు. అలా ‘ఆడుదామా ఆంధ్రా’ కార్యక్రమానికి చక్కటి ఓపెనింగ్ చేశారు జగన్.