Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh: 'ఆడుదాం ఆంధ్ర‌'కు గ్రామ వాలంటీర్ల సమ్మె ఎఫెక్ట్..

Aadudam Andhra: డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబురాలు నిర్వ‌హిస్తోంది. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా ప్రారంభించ‌గా, త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ గ్రామ వాలంటీర్లు ఆందోళ‌న‌కు దిగారు. 
 

CM YS Jagan Mohan Reddy Launches Adudam Andhra Program, Volunteers strike RMA
Author
First Published Dec 26, 2023, 1:19 PM IST

CM Jagan launch 'Aadudam Andhra': గ్రామస్థాయిలో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించడమే లక్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుండ‌గా, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంఛ‌నంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఘ‌నంగా ప్రారంభించారు. అయితే, ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్య‌క్ర‌మంపై గ్రామ వాలంటీర్ల నుంచి ఎఫెక్ట్ ప‌డింది. త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ గ్రామ వాలంటీర్లు నిర‌స‌న‌ల‌కు దిగారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి గ్రామ వాలంటీర్లు సమ్మెకు దిగనున్న‌ట్టు అంత‌కుముందు ప్ర‌క‌టించారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో సంతృప్తి చెందని గ్రామ వాలంటీర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం వరకు వాలంటీర్లతో సమ్మె చేయాలనే ఆలోచనతో అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంగళవారం సమ్మె సైరన్ మోగించాలని వాలంటీర్లు నిర్ణయించారు.  కార్య‌క్ర‌మం ప్రారంభం రోజు కావ‌డంతో ప‌లువురు అధికారులు, అధికార పార్టీ నేత‌లు స‌మ్మెను ఆప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం స్వచ్చంద వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి వాలంటీర్‌కు ప్రభుత్వం రూ.5000 గౌరవ వేతనంగా నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్థ చురుకుగా ఉంది. అయితే గౌరవ వేతనం విషయంలో గత కొంతకాలంగా వాలంటీర్లలో అసంతృప్తి నెలకొంది. పొరుగుసేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికుల జీతాలు కూడా తమకు అందడం లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాజాగా వీరికి రూ.750 వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

AADUDAM ANDHRA: 'ఆడుదాం ఆంధ్ర'కు భారీ ఏర్పాట్లు.. 9,043 గ్రౌండ్స్ లో పోటీలు

Follow Us:
Download App:
  • android
  • ios