Asianet News TeluguAsianet News Telugu

వెలిగొండ ప్రాజెక్టను ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.. సీఎం వైఎస్ జగన్

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. 

YS Jagan Speech AT Chimakurthy Prakasam district
Author
First Published Aug 24, 2022, 1:08 PM IST

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి కల్యాణమండపం వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 

రైతుల, పేదల సంక్షేమం అంటే గుర్తుకువచ్చే పేరు వైఎస్సార్ అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేదలకు చదువు అందేలా చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను నేరవేర్చామని చేశామని చెప్పారు. కుల, మత రాజీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఆవిష్కరించనున్నట్టుగా చెప్పారు. 

గ్రానైట్ పరిశ్రమకు మళ్లీ శ్లాబ్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 58 విడుదల చేసినట్టుగా తెలిపారు. ఈ విధానం వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని చెప్పారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో యూనిట్‌కు రూ. 2 తగ్గిస్తున్నట్టుగా చెప్పారు.  ఈ విధానం వల్ల చిన్న పరిశ్రమలకు మేలు జరుగుతుందని చెప్పారు. 7 వేల యూనిట్లకు లబ్ది  చేకూర్చేలా జీవో జారీ చేశామని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అన్నారు. 


వెలిగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు ఎంతో మేలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. వైస్సార్ సీఎంగా ఉన్నప్పుడు.. వెలిగొండ ప్రాజెక్టు పనులను ఉరుకులు, పరుగులు పెట్టించారని  చెప్పారు. చంద్రబాబు అధికారం రాకముందు 2014 నాటికి 18.80 కి.మీ మొదటి టన్నెల్‌లో 11.58 కి.మీ పనులు పూర్తయ్యాయని  చెప్పారు. రెండో టన్నెల్‌లో 18.78 కి.మీ గానూ.. 8.874 కి.మీ పనుల్లో పురోగతి సాధించినట్టుగా తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యక.. మొదటి టన్నెల్‌లో 4.33 కి.మీ, రెండో టన్నెల్‌లో కేవలం 2.35 కి.మీ పనులు చేసి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మొదటి టన్నెల్‌లో మిగిలిన పనులను పూర్తి చేశామని చెప్పారు. రెండో టన్నెల్‌లో 3.96 కి.మీ పనులు మిగిలి ఉన్నాయని.. వాటిని 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని

Follow Us:
Download App:
  • android
  • ios