‘రాష్ట్రంలో నీరో పాలన కన్నా నారా పాలనే ఘోరంగా ఉంది’... ఇది తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన ఓపెన్ లెటర్ లో పంచ్ డైలాగ్. రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్తలపై జగన్ శనివారం సిఎంకు బహిరంగ లేఖ రాసారు. అందులో రైతులు పడుతున్న కష్టాలు, విద్యార్ధులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు తదితరాలను ప్రస్తావించారు.

‘రాష్ట్రంలో నీరో పాలన కన్నా నారా పాలనే ఘోరంగా ఉంది’...ఇది తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన ఓపెన్ లెటర్ లో పంచ్ డైలాగ్. రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్తలపై జగన్ శనివారం సిఎంకు బహిరంగ లేఖ రాసారు. అందులో రైతులు పడుతున్న కష్టాలు, విద్యార్ధులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు తదితరాలను ప్రస్తావించారు. భారీ వర్షాల వల్ల ఒకవైపు, 10 లక్షల ఎకరాలు బీడుపడిపోయి ఇంకోవైపు రైతాంగం నానా అవస్తలు పడుతుంటే సెక్రటేరియట్ లో కూర్చుని చేస్తున్న ఘనకార్యాలేంటి ? అంటూ నిలదీసారు.

ఎన్నడూ లేనట్లు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఒకవైపు, మంత్రుల కళాశాలల్లోనే విద్యర్ధుల ఆత్మహత్యలు చేసుకోవటంపై జగన్ మండిపడ్డారు. రైతు గుండెకోత కానీ విద్యార్ధుల తల్లి దండ్రుల కడుపుకోత కానీ కదిలించటం లేదా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రైతులకు జరిగిన నష్టానికి పూర్తి పరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసారు. అలాగే, ‘విద్యార్ధుల, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో మీ పాత్రమీద ఆత్మపరిశీలన చేసుకోవాల’న్నారు.

‘రైతులు కష్టాల్లో ఉంటే, రాష్ట్రం నష్టపోతుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలని, పరుగులెత్తించాలని కానీ, స్వయంగా మీరే రంగంలోకి దిగాలని కానీ ఎందుకు అనిపించలేదం’టూ ధ్వజమెత్తారు. సన్మానాలు, సత్కారాలు, ల్యాండ్ డీల్స్, విదీశీ ప్రతినిధులతో ఫొటోలు దిగటం వంటి కార్యక్రమాలతోనే నాలుగు రోజులుగా బిజీగా ఉన్నారన్న విషయం సిఎం షెడ్యూల్ చూస్తే ఎవరికైనా అర్ధమవుతుందని ఎద్దేవా చేసారు.

‘చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ ఓ మోసంగా జగన్ కొట్టిపారేసారు. రైతులకు అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీలను ఎగ్గొట్టారని ఆరోపించారు. పావలా వడ్డీ పథకాన్ని సంపూర్ణంగా భూమిలో పాతేసారన్నారు. చేయాల్సిన రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేయకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితి దాపురించిందని చెప్పారు. పంటలబీమా లభించకపోవటంతో రుణమాఫీ వ్యవహారమే రైతాంగాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. చివరకు పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేని ప్రభుత్వం మీదేనంటూ దుయ్యబట్టారు.