ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23, 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారు.ఈ పర్యటనలో భాగంగా 24వ తేదీ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపోల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు ఏపీ క్లార్ భవన నిర్మాణాలకు, ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది..

ఈనెల 23వ తేదీన
ఈనెల 23వ తేదీ సాయంత్రం 3.00 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
4.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
4.25 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ఎస్టేట్ హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు.
4.45 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
4.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు.
24వ తేదీ పర్యటన ఇలా
ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
10.00 నుంచి 12.00 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
12.15 గంటలకు చర్చి నుంచి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
2.00 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.
2.20 గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు, బస్సుడిపో, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
3.05 గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్‌కు చేరుకుంటారు.
3.10 నుంచి 3.40 గంటల వరకు ఇమ్రా ఏపీకి శంకుస్థాపన చేస్తారు.
4.00 నుంచి 4.30 గంటల వరకు అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు.
4.45 గంటలకు వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లే అవుట్ హెలిప్యాడ్ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు బయలుదేరి వెళతారు.
5.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
5.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
25వ తేదీ పర్యటన ఇలా
ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ నుంచి పులివెందుల బాకరాపురం బయలుదేరుతారు.
9.25 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
9.45 నుంచి 11.00 గంటల వరకు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
11.05 గంటలకు సీఎస్‌ఐ చర్చి నుంచి భాకరాపురం హెలిప్యాడ్‌కు బయలుదేరి 11.15 గంటలకు చేరుకుంటారు.
11.20 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
11.55 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళతారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 23, 2020, 10:04 AM IST