తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని డోలాస్ నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ కేసు నమోదైన గ్యాలక్సీ అపార్టుమెంటు నుంచి ఇరువైపులా ఒక కిలోమీటరు వరకు అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. 

పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని, చుట్టుపకక్ల గ్రామాలను అధికారులు మూడు జోన్లుగా విభజించారు. ఒక కిలో మీటరు పరిధిని హైరిస్క్ జోన్ గా ప్రకటించారు. మూడు కిలోమీటర్ల మేర పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. 

ఏడు కిలోమీటర్ల పరిధిని అధికారులు బఫర్ జోన్ గా ప్రకటించారు. దీంతో తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం బఫర్ జోన్ లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం వరకు మొత్తం కేసుల సంఖ్య 525కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి 14 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాన్ని కర్నూలు ఆక్రమించింది.