Asianet News TeluguAsianet News Telugu

YCP Incharge: వారసులొచ్చారు.. 27 మందితో రెండో జాబితా..

YCP Incharge: వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదలైంది. వైసీపీ పార్టీ ఎట్టకేలకు మంగళవారం వైసీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఎప్పటిలాగానే ఎమ్యెల్యేను తాడేపల్లి పిలిపించి చర్చించి ఇన్ చార్జీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఇందులో కొందరు సిట్టింగ్  ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి జగన్ అవకాశం కల్పించారు.అలాగే..పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిలుగా నియమించారు. 

YS Jagan Release YSRCP MLA Candidates Second List KRJ
Author
First Published Jan 3, 2024, 1:10 AM IST

Ysrcp Incharges Second List : పలు చేర్పులు.. మార్పుల తర్వత వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ల రెండో జాబితా ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా మొత్తం 27 మందితో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల రెండో జాబితాను విడుదల చేసింది.ఈ  రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సామాజిక సమీకరణాలతో రెండో జాబితా రూపొందించినట్లు తెలిపారు. రెండో జాబితాతో పలువురు ప్రముఖ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అదే తరుణంలో పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జ్ ల బాధ్యతలు అప్పగించారు. రెండో జాబితాలో ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. 

కొత్త ఇన్ ఛార్జ్ లు

1. అనంతపురం ఎంపీ- మాలగుండ్ల శంకరనారాయణ
2. హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత
3. అరకు ఎంపీ (ఎస్టీ)- కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
4. రాజాం (ఎస్సీ)- తాలె రాజేష్
5. అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
6. పాయకరావుపేట (ఎస్సీ) - కంబాల జోగులు
7. రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాష్
8. పి.గన్నవరం (ఎస్సీ)- విప్పర్తి వేణుగోపాల్
9. పిఠాపురం- వంగ గీత
10. జగ్గంపేట -తోట నరసింహం
11. ప్రత్తిపాడు-వరుపుల సుబ్బారావు
12. రాజమండ్రి సిటీ- మార్గాని భరత్
13. రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
14. పోలవరం (ఎస్టీ)- తెల్లం రాజ్యలక్ష్మి
15. కదిరి- బి. ఎస్. మక్బూల్ అహ్మద్
16. ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్
17. ఎమ్మిగనూర్- మాచాని వెంకటేష్
18 .తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
19. గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
20. మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
21. చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
22. పెనుకొండ- కె.వి. ఉషా శ్రీచరణ్
23. కళ్యాణ దుర్గం - తలారి రంగయ్య
24. అరుకు(ఎస్టీ) -గొడ్డేటి మాధవి
25. పాడేరు (ఎస్టీ)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు
26. విజయవాడ సెంట్రల్ - వెలంపల్లి శ్రీనివాస రావు
27. విజయవాడ వెస్ట్- షేక్ ఆసిఫ్

 

వారసులొచ్చారు..
 
మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి మచిలీపట్నం బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి బాధ్యతలు, ఈస్ట్ ముస్తఫా కూతురు షేక్ నూరి ఫాతిమా కు  గుంటూరు బాధ్యతలు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ ను రామచంద్రాపురం ఇన్ ఛార్జ్ గా నిమించారు.  టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి బాధ్యతలు,  పోలవరం ఎమ్మెల్యే బాలరాజు భార్య భాగ్యలక్ష్మి లకు బాధ్యతలు అప్పగించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios