పిరికిపంద జగన్... బిటెక్ రవిని చూసి భయపడుతున్నావులే..!: నారా లోకేష్ (అరెస్ట్ వీడియో)
రాజకీయ ప్రత్యర్థి బిటెక్ రవిని చూసి పిరికిపంద జగన్ భయపడిపోతున్నాడని తాజా అరెస్ట్ తో అర్థమవుతోందని నారా లోకేష్ అన్నారు.

కడప : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీచేసిన టిడిపి నాయకుడు బిటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేసారు. మంగళవారం రాత్రి కడప నుండి పులివెందుకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసారు. డ్రైవర్ తో పాటు గన్ మెన్లను అక్కడే వదిలేసి కేవలం బిటెక్ రవిని మాత్రం పోలీసులు తమ వాహనంలో తీసుకువెళ్లారు. ఈ అరెస్ట్ తో ఇప్పటికే కల్లోలంగా వున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత కలకలం రేపింది.
బిటెక్ రవి అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చివరకు పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలన్నా జగన్ రెడ్డి గజగజా వణుకుతున్నాడని రవి అరెస్ట్ తో మరోసారి భయటపడిందని అన్నారు. జగన్ వస్తున్నాండటే ఆ ప్రాంతాల్లో పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత మామూలే... ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడగానే జగన్ రెడ్డి భయపడిపోతున్నారని అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్ అని లోకేష్ మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, పులివెందుల టిడిపి ఇంచార్జి బీటెక్ రవిని చూసి వైఎస్ జగన్ భయపడుతున్నాడని లోకేష్ అన్నారు. రాజకీయ కక్షసాధింపుకి పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడని అన్నారు. రవి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని.... ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని నారా లోకేష్ హెచ్చరించారు.
Read More టాప్ స్టోరీస్ : బీటెక్ రవి అరెస్ట్, కులగణన.. ఎన్నికల ప్రచారాల జోరు..
మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై వెళుతుండగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయనను తమ వాహనంలో ఎక్కించుకుని నేరుగా వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి కడప ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో బిటెక్ రవికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వీడియో
రవి అరెస్ట్ పై కడప ఎస్పీ ప్రకటన...
బిటెక్ రవి అరెస్ట్ పై కడప ఎస్పీ షరీఫ్ స్పందించారు. గతంలో నారా లోకేష్ పులివెందుల పర్యటన సందర్భంగా జరిగిన తోపులాట, ఆందోళనపై పోలీస్ కేసు నమోదయ్యింది. టిడిపి శ్రేణుల తోపులాటలో పోలీస్ అధికారులు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి తాజాగా రవిని అరెస్ట్ చేసినట్లు కడప ఎస్పీ వెల్లడించారు.