జగన్ పాదయాత్రకు వర్షం ఆటంకం.. రేపటికి వాయిదా

ys jagan praja sankalpa yatra postponed tomorrow
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వర్షం ఆటంకం కలిగించింది.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మీదుగా ఆయన యాత్ర సాగుతోంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు వర్షం ఆటంకం కలిగించింది.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మీదుగా ఆయన యాత్ర సాగుతోంది. అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాల వద్ద ఉన్న జగన్ 213వ రోజు ఇవాళ ఉదయం ప్రారంభం కావాల్సి వుండగా.. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో.. యాత్రను రేపటికి వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారు.. రేపటి షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 
 

loader