జగన్ కీలక నిర్ణయం.. వ్యుహాకర్తగా పీకే స్థానంలో రిషి రాజ్ సింగ్!.. ఇంతకీ ఆయన ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వ్యుహాలను సిద్దం చేస్తోంది. 2019 ఎన్నికల కోసం.. ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వైసీపీ వియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల కోసం రిషి రాజ్‌ సింగ్‌ను వైసీపీ వ్యుహాకర్తగా నియమించుకున్నట్టుగా తెలుస్తోంది.

YS Jagan piks IPAC Rishi Raj Singh for Next election report

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వ్యుహాలను సిద్దం చేస్తోంది. 2019 ఎన్నికల కోసం.. ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వైసీపీ వియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి మరోసారి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సేవలను వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్.. కాకుండా రుషి రాజ్ సింగ్ నేతృత్వంలో ఐ ప్యాక్ సేవలను వైసీపీ వియోగించుకోబోతుందని ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పినట్టుగా హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. అయితే ఆ నాయకుడు తన పేరు విషయంలో గోప్యత కోరుకున్నట్టుగా తెలిపింది. 

ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ పనిచేసింది. ఆ ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. ఇందులో పీకే టీమ్‌ కృషి కూడా ఉంది. అయితే కొంతకాలంగా ప్రశాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు, వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రశాంత్ కిషోర్ సేవలను వచ్చే ఎన్నికల కోసం వాడుకోవడం లేదని ఇటీవల కామెంట్ చేశారు. ‘‘ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు’’ అని సజ్జల చెప్పారు. 

అయితే తాజాగా ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. టీడీపీ సభలకు జనం నుంచి మద్దతు వస్తుందనే నివేదికల నేపథ్యంలో రానున్న ఎన్నికలకు మరోసారి ఐప్యాక్ సేవలను వినియోగించుకోవాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తన సూరజ్ మిషన్‌తో బిజీగా ఉండటంతో.. ఐప్యాక్ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రిషి రాజ్ సింగ్‌ నేతృత్వంలోని ఐప్యాక్ బృందాన్ని నియమించుకుంది. 

YS Jagan piks IPAC Rishi Raj Singh for Next election report

‘‘గతంలో కాకుండా.. కిషోర్ బీహార్‌లో తన జన్ సూరజ్ మిషన్‌తో బిజీగా ఉన్నందున.. ఈసారి ఏపీలో వైసీపీ కోసం నేరుగా పనిచేయరు. అయితే కిషోర్ సహోద్యోగి, డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని I-PAC నుంచి నిపుణుల బృందం వచ్చే ఎన్నికల వరకు YSRCP కోసం పని చేస్తుంది” సదురు వైసీపీ నాయకుడు చెప్పినట్టుగా హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నాయకులతో  సమావేశంలో ఐ-ప్యాక్‌ నియామక వార్తను జగన్ అధికారికంగా ప్రకటిస్తారని సదురు నాయకుడు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు రిషి రాజ్ సింగ్‌ను పరిచయం చేయాలని జగన్ భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

వచ్చే ఎన్నికల వరకు పనిచేసే విధంగా ఈ ఏడాది మే నెలలో ఐ ప్యాక్‌తో వైసీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా పార్టీ నాయకుడు తెలిపారు. అయితే ఈ డీల్ కోసం వైసీపీ ఎంత మొత్తం చెల్లిస్తుందనేది మాత్రం తెలియరాలేదు. ఇక, ఈ బృందం మే 15 నుండి వైసీపీ కోసం గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించిందని.. సంక్షేమ పథకాల అమలుపై క్రాస్ సెక్షన్ ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తుందని సమాచారం. ప్రస్తుతం రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని టీమ్ ప్రభుత్వ పనితీరు గురించి వివిధ మీడియా నివేదికలను విశ్లేషించడం ప్రారంభించారని సదురు నాయకుడు చెప్పారు. 

రిషి రాజ్ సింగ్ గురించి.. 
ఉత్తరప్రదేశ్‌కు రిషి రాజ్ సింగ్.. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ కాలేజీలలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్‌లో చదివాడు. ఆ తరువాత, ముంబైలో పెట్టుబడి బ్యాంకర్‌గా మారారు, మంచి జీతం పొందారు. అయితే అతను రాజకీయ వ్యుహాకర్తగా మారాలని నిర్ణయించుకున్నారు. రిషి తన కొంతమంది స్నేహితులతో కలిసి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG) అనే సంస్థను స్థాపించారు. కాగ్.. అప్పటి భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం కోసం పనిచేసిన సంస్థ. త్రీడీ షోల నుంచి ‘చాయ్ పే చర్చా’ వరకు మోదీకి సంబంధించిన అన్ని ప్రచారాలను కాగ్ నిర్వహించింది. రిషి రాజ్ నేతృత్వంలోని కాగ్ చేసిన ప్రచారాలు విజయవంతం అయాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.  లోక్‌సభ ఎన్నికల తర్వాత రిషి రాజ్.. కాగ్‌ని రద్దు చేశారు.

YS Jagan piks IPAC Rishi Raj Singh for Next election report

ఆ తర్వాత ప్రశాంత్‌తో కిషోర్‌తో కలిసి ఐ ప్యాక్‌లో కీలకంగా వ్యహరిస్తున్నారు. నితీశ్ కుమార్..కేజ్రీవాల్..మమతా బెనర్జీ..స్టాలిన్ గెలుపు వెనుక వ్యూహాల అమలులోనూ రిషి ప్రధాన భూమిక తీసుకున్నారు. సీఎం జగన్ కు రుషి రాజ్ తో 2017 నుంచి పరిచయం ఉంది. ప్రశాంత్ కిషోర్ టీం లో కీలక సభ్యుడిగా..వైసీపీ కోసం ఆయన పని చేసారు. ఈ అనుబంధం నేపథ్యంలోనే 2020 ఫిబ్రవరిలో సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి రిషి రాజ్ సింగ్ వివాహానికి హాజరయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios