రైతుల ఆందోళనలో పాల్గొన్న జగన్

రైతుల ఆందోళనలో పాల్గొన్న జగన్

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. పాదయాత్రలో 10వ రోజు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా జగన్ కర్నూలు-దొర్నిపాడు మండలంలోని రైతులతో భేటీ అయ్యారు. తలపై పచ్చటి తలపాగా చుట్టుకుని జగన్ వైరెటీగా కనిపించారు. రైతుల సమస్యలపై వారితో మాట్లాడుతున్నారు కాబట్టి బహుశా సింబాలిక్ గా ఉంటుందని జగన్ పచ్చ రంగు తలలపాగా పెట్టుకున్నట్లున్నారు.

జగన్ రైతులన్న ప్రాంతానికి చేరుకునేటప్పటికే వందలాది రైతులు శ్రీశైలం ప్రాజెక్టు నుండి కెసి కెనాల్ కు నీటి విడుదల కోసం ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనలో జగన్ కూడా పాల్గొన్నారు. ఇపుడు సాగు నీరు విడుదల చేయకపోతే తమ బ్రతుకులు అన్యాయమూపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. పనిలో పనిగా దొర్నిపాడులో జగన్ ను కలిసిన రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందకపోవటంతో రోడ్డున పడుతున్నట్లు ఆరోపించారు. నీటి విడుదలకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కేసీ కెనాల్ రైతులు డిమాండ్ చేసారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos