ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి బయలు దేరారు. నేటి ఉదయం 8.35 గంటలకు సచివాలయానికి చేరుకుని.. 8.39కి సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగు పెట్టనున్నారు. అనంతరం 8.50కి కీలక ఫైలుపై జగన్ మొదటి సంతకం చేయనున్నారు. 9.10కి సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాలు సన్మానం చేయనున్నాయి.
 
ఉదయం 10 గంటలకు కార్యదర్శులు, శాఖాధిపతులతో తొలి సమావేశం జరగనుంది. 10.50కి ఉద్యోగులనుద్దేశించి జగన్‌ ప్రసంగించనున్నారు. 11.15కి గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.