ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు వైఎస్ జగన్. 1983 ఎన్నికల్లో టీడీపీని స్థాపించిన దివంగత సీఎం ఎన్టీఆర్ కిలో రూ.2కే కేజీ బియ్యం అంటూ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆ పథకానికి ప్రజలు ముగ్ధులయ్యారని తెలిపారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర అనంతరం వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సమర శంఖారావం, అన్నపిలుపు వంటి కార్యక్రమాలకు కార్యచరణ రూపొందించారు.
తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే వైఎస్ జగన్ అన్న పిలుపు కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రజలను ప్రభావితం చేసే తటస్థులకు ఇప్పటికే వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఆ తర్వాత వివిధ శాఖల ఉద్యోగులకు కూడా లేఖలు రాశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. లేఖపై పార్టీ గుర్తు ఫ్యాన్, జగన్ ఫొటోను ముద్రించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు ఆఖరున ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.
విధి నిర్వహణల మీరు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మిమ్మల్ని కలిసి ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు. 368 రోజులు నేను చేసిన పాదయాత్రలో మీ గుండెచప్పుడు విని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను.
పాదయాత్రలో భాగంగా మీలాంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకోవడం నా అదృష్టమంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రగతి కోసం నేను రూపుదిద్దే కార్యాచరణ కోసం మీ విలువైన సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నారు.
చివరన మెయిల్ ఐడీతోపాటు ఫోన్ నంబర్ కకూడా ఇచ్చారు. తనను కలవాలంటే కాల్ చెయ్యాలని కూడా సూచించారు వైఎస్ జగన్. ఇలా ఇప్పటి వరకు 70వేల మందికి వైఎస్ జగన్ లేఖలు రాశారు. అలా లేఖలు అందిన వారిలో 175 మందితో వైఎస్ జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు.
న్యూట్రల్ గా ఉన్న విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, వైద్యులు, మేధావులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాను రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యతక గురించి వారితో చర్చించారు. తాను భవిష్యత్ లో చేపట్టబోయే అంశాలపై కూడా వారితో చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు వైఎస్ జగన్. 1983 ఎన్నికల్లో టీడీపీని స్థాపించిన దివంగత సీఎం ఎన్టీఆర్ కిలో రూ.2కే కేజీ బియ్యం అంటూ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆ పథకానికి ప్రజలు ముగ్ధులయ్యారని తెలిపారు.
ఎన్టీఆర్ 2రూపాయలకే బియ్యం అని ప్రకటించడంతో ఆనాటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి రూపాయి 90 పైసలకే కిలోబియ్యం అంటూ ప్రకటించేశారని తెలిపారు. పదిపైసలు తక్కువ ప్రకటించినా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విసిగిపోయిన వారంతా ఎన్టీఆర్ కే జై కొట్టారని అలాంటి పరిస్థితి త్వరలో రానుందన్నారు వైఎస్ జగన్.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీలో ఊపందుకున్న అన్న పిలుపు: ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు
