న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వైసీపీ శాసనసభపక్ఫ నేతగా ఎన్నికైన మరుసిటి రోజునే జగన్ మోడీతో సమావేశమయ్యారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు పలువురు ఎంపీలతో కలిసి జగన్ న్యూఢిల్లీకి చేరుకొన్నారు.

ఎయిర్‌పోర్టు నుండి నేరుగా ప్రధాని నివాసానికి ఆయన  వెళ్లారు. సుమారు గంటకు పైగా మోడీతో చర్చించనున్నారు. ఈ నెల 30వ తేదీన తన ప్రమాణస్వీకారానికి రావాలని జగన్‌ ప్రధాని మోడీని ఆహ్వానించారు. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి  రాష్ట్రానికి నిధులను అందించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడ కోరనున్నారు. విభజన హామీలను కూడ అమలు చేయాలని మోడీని జగన్ కోరే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి పెండింగ్‌ నిధులను కూడ వెంటనే ఇవ్వాలని కోరనున్నారు.మోడీతో భేటీ అనంతరం జగన్ ఏపీ భవన్‌కు వెళ్లనున్నారు.  అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు.