వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన ఆయన.. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించారు. అనంతరం ఆయన నేరుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఈ నెల 30వ తేదీన విజయవాడలో తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అమిత్ షా‌ను జగన్ ఆహ్వానించారు.

30 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో రాష్ట్ర విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.