వైఎస్ జగన్ బిసిల శత్రువు

First Published 11, Jun 2018, 4:14 PM IST
ys jagan is anti bc : minister kaluva srinivasulu
Highlights

మంత్రి కాలువ శ్రీనివాసులు ఫైర్

వైసిపి అధినేత జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి కాలువ శ్రీనివాసులు. అమరావతిలో కాలువ మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

బిసిల మీద అంతా ప్రేమ చూపే జగన్...వైయస్ హయాంలో బిసిలకు ఏమి చేశారో చెప్పాలి..? వైయస్ హయాంలో రెండు బిసి ఫెడరేషన్ లు వేశారు..రూపాయి ఖర్చు పెట్టలేదు. టిడిపి హయంలో అత్యంత కీలకమైన శాఖలను బిసిల చేతిలో ఉంచిన ఘనత చంద్రబాబుకు దక్కింది. వైసిపి ఎవరి చేతిలో ఉంది...ఎవరికి ప్రాధాన్యత ఉందో ప్రజలకు తెలియదా? గురివింద సామెత జగన్ మాటలలో కనపడుతుంది.

సినిమాలో ఓ వ్యక్తిని చంపి..అదే వ్యక్తి శవానికి దండవేసే సంస్కృతి...జగన్ లో కనపడుతుంది. జగన్ కు కనీసం బిసి నాయకుడు మీద చేయి వేసి మాట్లాడటానికి కూడా మనస్సు ఒప్పదు. బిసిల గురించి వారి అభ్యున్నతి గురించి జగన్ మాట్లడకపోవడం మంచిదని సూచిస్తున్నాను. మైనార్టీలకు ఎమ్మెల్సీ ఇస్తానాన్ని  నంద్యాల ఉపఎన్నికల సమయంలో జగన్ మాటయిచ్చి నిలబెట్టుకోలేదు. దీనిని బట్టి జగన్ కు మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది. బిసీలు ఆధికంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో గడిచిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు బిసిలకు కేటాయించారో చెప్పాలి.  

loader