Asianet News TeluguAsianet News Telugu

YS Jagan: కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం చూడాలన్న సీఎం జగన్.. బీఏసీలో ఆసక్తికర చర్చ..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీఏసీ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుప్పం (Kuppam), నెల్లూరు (Nellore) మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో (bac meeting) ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ (YS Jagan) ఆసక్తికర కామెంట్స్ చేశారు.
 

YS Jagan Interesting comments on chandrababu Over Kuppam Municipal result
Author
Amaravati, First Published Nov 18, 2021, 12:23 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీఏసీ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుప్పం (Kuppam), నెల్లూరు (Nellore) మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో (bac meeting) ప్రస్తావన వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ (YS Jagan).. సభకు చంద్రబాబును తీసుకురావాలని అన్నారు. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా  టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) స్పందిస్తూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమేనని అన్నారు. చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ మాట్లాడుతూ.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఇక, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి.. ఒక్క రోజే సభ జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం  (Tammineni Sitaram)  చెప్పారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని.. 15 రోజులు సమావేశాలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్.. ‘గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన అడిగితే అంగీకరించకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 26 వరకు సభ జరుపుదామని జగన్ అన్నారు. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని కోరారు.

Also read: AP Assembly: ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం..

ఇక, ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది.

అసెంబ్లీ సమావేశాల పొడగింపుకు సంబంధించి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. సభను ఎన్ని రోజులైన కొనసాగించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టెక్నికల్‌గా ఈరోజు ఒక్కరోజు సభను కొనసాగించాలి కాబట్టి నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తర్వాత జరుపుదామని అనుకున్నప్పటికీ.. టీడీపీ వాళ్లు సభ జరపాలని అడిగారు. ఈ క్రమంలోనే సభను 26వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏ అంశంపైన చర్చించడానికైనా ప్రబుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు. 

ఇక, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇలాకాలోని కుప్పం మున్సిపాలిటీని వైసీపీ(YSRCP) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవంతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios