పులివెందుల: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. తమ ప్రియతమ నేతలకు కడపటి వీడ్కోలు పలికేందుకు పెద్ద యెత్తున అభిమానులు పులివెందులకు తరలి వచ్చారు. 

వైఎస్ వివేకా అంతిమ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి సహా పలువురు వైసిపి నాయకులు, బంధువులు పాల్గొన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు రాజారెడ్డి ఘాట్ లో జరగనున్నాయి. శనివారం ఉదయం ప్రార్థనలు ముగిసిన తర్వాత వైఎస్ వివేకా అంతిమ యాత్రం ప్రారంభమైంది.