విశాఖలో జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 15, Aug 2018, 1:37 PM IST
YS JAGAN IN INDEPENDENCE DAY CELEBRATIONS
Highlights

విశాఖపట్టణం జిల్లా ఎర్రవరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఎర్రవరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎర్రవరం జంక్షన్ వద్ద ప్రజాసంకల్ప యాత్ర విడిది శిబిరం దగ్గర వైఎస్ జగన్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 

అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.   

loader