కర్నూలు: మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డిని దాచింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నేత, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం  కర్నూలులో మాట్లాడిని ఆయన వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు బదులు కోడి కత్తి పెట్టుకుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 
 
మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి, మంగలి కృష్ణ అరాచకాలకు వైఎస్ జగన్‌, టీఆర్‌ఎస్‌ నేతలు అండగా ఉన్నారంటూ ఆరోపించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏపీ పోలీసులు లేకుండా జగన్ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. 

జగన్ కు భద్రత కల్పించింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ పోలీసులు అనునిత్యం జగన్ కు రక్షణ కవచంలా పనిచేశారని అలాంటి వారిపై నమ్మకం లేదని జగన్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.