స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 3న ఇందుకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. సంక్రాంతి నాటికి ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేయాలని సర్కార్ భావిస్తోంది.

Also Read:జగన్ ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పావో గుర్తుందా: పవన్ కళ్యాణ్

ముందుగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు.. రెండో దశలో సర్పంచ్ ఎన్నికలు, చివరి దశలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పంచాయతీ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా ఎస్టీలకు 6.77 శాతానికి, ఎస్సీలకు 19.08 శాతానికి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలను నిర్వహించనున్నారు. గత శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు.

ఇదే సమావేశంలో రాజధాని తరలింపుపైనే ప్రధానంగా చర్చించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న సీఎం.. రాజధాని తరలింపుపై తొందరలేదని, ప్రజలకు అన్ని వివరాలు వివరించిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read:వై‌ఎస్ జగన్ మూడు రాజధానులు: విశాఖ ఏ మేరకు సేఫ్ ?

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఇచ్చిన తర్వాత రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని జగన్ వెల్లడించారు. అలాగే 412 కొత్త 108 వాహనాల కొనుగోలు కోసం రూ.71.48 లక్షల మంజూరుచేశారు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.