ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపు: మిగతా ఐదు జిల్లాలో యధాతథం
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటీవిటీ రేటు తక్కువగా ఉండడంతో ఈఠ జిల్లాల్లో ఆంక్షల్లో సడలింపులు ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కర్ప్యూ ఆంక్షలను సడలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమావేశంలో సోమవారం సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవిడి పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నారు.
ఈ సడలింపులు జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఎనిమిది జిల్లాల్లో ఆంక్షలను సడలించారు. మిగతా ఐదు జిల్లాల్లో యథాతథంగా ఆంక్షలు కొనసాగుతాయి.
ప్రకాశం, ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో కర్ఫ్యూ యథాథంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఈ జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటి రేటును పరిశీలించిన తర్వాత ఆంక్షలను సడలించే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.