Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ అర్థరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార వికేంద్రీకరణను ఆచరణలో పెట్టింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి ఓ జీవోను జారీ చేసింది. న్యాయవిభాగానికి సంబంధించిన కొన్ని కార్యాలయాలు కర్నూలుకు తరలనున్నాయి.

YS Jagan govt begins decentralisation of administration
Author
Amaravathi, First Published Feb 1, 2020, 6:49 AM IST

అమరావతి: పాలనా వికేంద్రీకరణ విషయంలో ముందుకే సాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ విషయంలో శుక్రవారం అర్థరాత్రి ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఆ విభాగాలన్నీ వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవి కర్నూలు తరలనున్నాయి. ఈ విభాగాలన్నింటికీ అవసరమైన భవనాలు సమకూర్చాలని ఆర్ అండ్ బీ, కర్నూలు కలెక్టర్ కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

న్యాయసంబంధితమైన కార్యాలయాలను అన్నింటినీ కర్నూలులో పెడుతామని ఏపి ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఆ మేరకు తమ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ఓ వైపు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముందుకే వెళ్లాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దాన్ని అమలు పెడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios