ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది . ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా వుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పి.వి.విజయబాబును అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి తెలుగులోనే ఉత్తర్వులను ఇవ్వడం విశేషం. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో తెలుగు వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచిస్తూ ఈ మేరకు భాషా , సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.

ALso REad:ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం: అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ రాజీనామా

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. చంద్రబాబుపై తనది సైద్ధాంతిక విరోధమే తప్ప వేరేది కాదని.. చెన్నై, హైదరాబాద్‌లలో వున్న నివాస గృహాలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబేనని లక్ష్మీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ చనిపోయిన ఇంటిని కూలగొట్టి అపార్ట్‌మెంట్ కట్టారని.. తన దృష్టిలో జగన్ ఒక హీరో అన్న ఆయన, జగన్‌ను వదిలపెట్టనని యార్లగడ్డ స్పష్టం చేశారు. అమరావతికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు.