అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ సర్ాకర్ నిర్ణయం తీసుకొంది.

Also read:పనికిమాలిన కబుర్లు కాకుండా పనికొచ్చేవి చెప్పు: చంద్రబాబుపై కొడాలి నాని

2016 జనవరి లో తునిలో  కాపుల సభ సందర్భంగా చోటు చేసుకొన్న హింసాకాండపై నమోదైన కేసులను ప్రభుత్వం  ఎత్తివేసింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో చోటు చేసుకొన్న కేసులను కూడ ఎత్తేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులో అనంతపురం, గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడ నమోదైన కేసులను కూడ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.