ప్రజా సంకల్పయాత్రలో జగన్ యూత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ప్రజా సంకల్పయాత్రలో జగన్ యూత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. యాత్ర ప్రారంభమైన 6వ రోజు జగన్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యాత్ర ప్రారంభం నుండి కూడా జగన్ వెంట యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఫాలో అవుతున్న విషయం అందరకీ తెలిసిందే. గడచిన ఆరు రోజుల్లో యువత ఎక్కడ జగన్ ను కలిసినా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అందటం లేదనే ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులను ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. దాంతో జగన్ ఈ విషయమై నిపుణులతో చర్చించినట్లు సమాచారం. అందుకనే ఆదివారం యాత్రలో భాగంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి రాగానే ఫీజులన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. యువత బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటికన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారు.