Asianet News TeluguAsianet News Telugu

మహిషాసురుడు అడుగుపెడితే అంధకారం..చంద్రబాబు అడుగుపెడితే కరువు: జగన్ ధ్వజం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాదయాత్ర చేస్తున్న జగన్ బొబ్బిలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబును తూర్పారబట్టారు. బొబ్బిలిలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ys jagan fires on chandrababu naidu
Author
Vizianagaram, First Published Oct 17, 2018, 6:02 PM IST

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాదయాత్ర చేస్తున్న జగన్ బొబ్బిలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబును తూర్పారబట్టారు. బొబ్బిలిలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బొబ్బిలి నియోజకవర్గంలో 38వేల 150 ఇళ్లు నిర్మిస్తే చంద్రబాబు పాలనలో ఒక్క ఇళ్లు అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ మారనని చెప్తున్న మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు ఊరికి నాలుగు ఇళ్లు అయినా ఇప్పించావా అని జగన్ నిలదీశారు. బొబ్బిలి నియోజకవర్గంలో పాలన అధ్వాన్నంగా ఉందని దుయ్యబుట్టారు. 

చంద్రబాబు పాలననుమహిషాసుర పాలనతో పోల్చుతూ జగన్ కథ చెప్పారు. దసరా పండుగలో మహిషాసురుడుని ఏవిధంగా అంతమెుందిస్తారో రాష్ట్రంలో చంద్రబాబు పాలనను కూడా అంతమెుందించాలని పిలుపునిచ్చారు. గతంలో మహిషాసరుడు రాక్షసుడు అయితే ఇప్పుడు చంద్రబాబు రాక్షసుడంటూ ధ్వజమెత్తారు.  

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునేందుకు సిగ్గుపడడని మండిపడ్డారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చెయ్యడానికి సిగ్గుపడరంటూ మండిపడ్డారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికి అయినా చంద్రబాబు వెనుకాడరన్నారు. ఆ కాలంలో రాక్షసుడు మహిషాసురుడు అయితే ఈ కాలంలో నారాసురుడు అంటూ పోల్చారు. 

దేవుడు ఇచ్చిన శక్తులను దుర్మార్గాలకు మహిషా సురుడు వినియోగిస్తే, ప్రజలు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారంటూ మండిపడ్డారు. మహిషాసరుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ అంధకారమని చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు, ప్రకృతి విపత్తులంటూ ధ్వజమెత్తారు జగన్. 

Follow Us:
Download App:
  • android
  • ios