Asianet News TeluguAsianet News Telugu

2022 జూన్ నాటికి 46 వేల కి.మీ. రోడ్ల మరమ్మత్తులు: జగన్ ఆదేశం


రోడ్ల మరమ్మత్తుల విషయమై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్లను మరమ్మత్తులను చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని రోడ్ల మరమ్మత్తులను పూర్తి చేయాలని సీఎం కోరారు.

YS Jagan directs to take up road repairs on priority
Author
Guntur, First Published Nov 15, 2021, 9:13 PM IST

అమరావతి: రాష్ట్రంలోని 46 వేల కి.మీ. మేరకు రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు.సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ల మరమ్ముత్తులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుల విషయంలో విమర్శలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.ఎస్‌డీబీ ప్రాజెక్టుల్లో టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని రహదారులపై ముందుగా గుంతలు పూడ్చి ఆ తర్వాత కార్పెటింగ్ చేయాలని Ys Jagan కోరారు.అన్నిroads మీద గుంతలు పూడ్చాలన్నారు. రాష్ట్రంలో ఏ రోడ్డుపై కూడా గుంతలు ఉండొద్దని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో  పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్ నుండి జూన్ వరకు రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎం కు హామీ ఇచ్చారు.ఎక్కడ ముందు  అవసరమైతే  ఆ రోడ్డులో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని సీఎం కోరారు.

అన్ని వంతెనలు, ఫ్లైఓవర్లు, ఆర్‌వోబీలను ఫేజ్-1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొని కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం సూచించారు.రోడ్ల మరమ్మత్తుకు ముందు ఫోటోలు తీసి రోడ్ల మరమ్మత్తు తర్వాత  రోడ్ల ఫోటోలు తీయాలని అధికారులను కోరారు సీఎం జగన్.2022 జూన్ నాటికి రోడ్ల మరమ్మత్తులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు.గతంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై Jana sena, bjp  ఆందోళనలు నిర్వహించింది.ఈ విషయమై  ఈ  ఆందోళనలపై వైసీపీ ఎదురు దాడికి దిగిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని  సీఎం  జగన్ అధికారులను ఆదేశించారు.

also read:చంద్రబాబు కుప్పం కోట బద్దలైంది: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

అక్టోబర్ నెలాఖరుకల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని  ఆ తర్వాత అభివృద్ధి పనులకు అనువైన పరిస్థితలుంటాయన్నారు. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నంటినీ బాగు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని సెప్టెంబర్ మాసంలో జరిగిన రివ్యూలో జగన్ అధికారులను ఆదేశించారు.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో సీఎం జగన్ రోడ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇవాళ ఈ విషయమై సమీక్షించారు.  అక్టోబర్ నెలాఖరుకల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని  ఆ తర్వాత అభివృద్ధి పనులకు అనువైన పరిస్థితలుంటాయన్నారు. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నంటినీ బాగు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని సెప్టెంబర్ మాసంలో జరిగిన రివ్యూలో జగన్ అధికారులను ఆదేశించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios