బ్రేకింగ్ న్యూస్: ఎంపిల రాజీనామాలకు నిర్ణయం

First Published 26, Mar 2018, 12:56 PM IST
ys jagan directed MPs to resign in the last day of parliament session
Highlights
ఎంపిలను రాజీనామాలు చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు

సోమవారం జరిగిన కీలక సమావేశంలో ఎంపిలు రాజీనామాలు చేయాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేెకహోదాపై కేంద్ర  ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఈరోజు ఉదయం ఎంపిలు, కీలక నేతలతో జగన్ సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. కేంద్రానికి వ్యతిరేకంగా వైసిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా లోక్ సభలో చర్చకు రానీయకుండా అడ్డుకోవటంపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మేకపాటి మాట్లాడుతూ, కేంద్రంపై నిరసనగా తమతో పాటు టిడిపి ఎంపిలు కూడా రాజీనామాలు చేయలని ఫిట్టింగ్ పెట్టారు. తమ రాజీనామాలకు స్సీకర్ ఫార్మాట్లోనే అందిస్తామన్నారు.

loader