Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష.. ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తగ్గించాలని కేంద్రాలని లేఖ రాయాలని నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

YS Jagan Decided to write letter to Centre to reduce precautionary dose time period
Author
Amaravati, First Published Jan 17, 2022, 2:57 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్బంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను అధికారులు వివరించారు. సెకండ్ వేవ్‌తో పోలిస్తే.. కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచినట్టుగా చెప్పారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సందర్భంగా..104 కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని సీఎం జగన్ అదేశించారు. టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్ వ్యాక్సిన్ పంపిణీ కాస్తా తక్కువగా ఉందని.. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వ్యాక్సినేషన్‌ ఉధృతంగా కొనసాగించాలన్నారు. 

రోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్‌పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రిఫరల్‌ పాయింట్‌గా క్లినిక్స్‌ వ్యవహరించాలని, వైద్యంకోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం అందించాలన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios