అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ఒక్కొక్కరు ఆయా పదవులకు గుడ్ బై చెప్తున్నారు. తాజాగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవికి వై. శ్రీనివాసా శేష సాయిబాబు రాజీనామా చేశారు.  

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. తన మార్కు పాలనపై దృష్టిసారించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కె.రాఘవేంద్రరావు, అంబికా కృష్ణలతోపాటు పలువురు రాజీనామా చేశారు. తాజాగా వారి బాటలో సాయిబాబు కూడా పయనించారు.