ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు ముగిసింది.
ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు ముగిసింది. మొదటిరోజైన సోమవారం ఇడుపులపాయ నుండి వేంపల్లి వరకూ, అంటే 8.9 కిలోమీటర్లు నడిచారు. మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర సాగింది. వీరన్నగట్టుపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను జగన్ ఆవిష్కరించారు. రెండో రోజు పాదయాత్ర వెంపల్లె రోడ్డు నుండే ప్రారంభమవుతుంది. పాదయాత్ర పొడవునా ప్రజలు, వైసీపీ నేతలు, శ్రేణులు జగన్ కు అఖండ స్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుండే కాక పొరుగునున్న తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి నుండి అభిమానులు తరలివచ్చారు. జగన్ తో పాటు వేలాదిమంది అడుగులు కదిపారు.
