Asianet News TeluguAsianet News Telugu

సోనియా ఇప్పుడు అందాల కొండనా: బాబుపై జగన్ విసుర్లు

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఎవరూ ఉండరంటూ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

YS Jagan accuses Chandrababu earlier alliance with BJP
Author
Rajam, First Published Dec 3, 2018, 6:32 PM IST

రాజాం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడు ఎవరూ ఉండరంటూ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

2014 ఎన్నికలకు ముందు పిల్లలు తాగి చెడిపోతున్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక రద్దు చెయ్యడం మానేసి ఇంటింటికి బెల్ట్ షాపులకు అనమతిచ్చారని తెలిపారు. 

రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. రుణాలు రీషెడ్యూల్ చెయ్యకుండా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా విమానాల్లో ప్రయాణిస్తున్నాడని విమర్శించారు. 

తిత్లీ తుఫాన్ షో చేస్తాడు ఏదో చేసినట్లు బిల్డప్ ఇస్తాడని మండిపడ్డారు. ఉదయమే విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళి కుమార స్వామితో టీ తాగుతాడు, తమిళనాడు స్టాలితో కలిసి సాంబార్ ఇడ్లీ తింటాడంటూ ఎద్దేవా చేశారు. వెస్ట్ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో టీ తాగుతారంటూ మండిపడ్డారు.  

తమని పట్టించుకోవాలని ప్రజలు చంద్రబాబును సీఎం చేస్తే ఆయన మాత్రం రాష్ట్రాలు తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. ఎవడో ప్రధానిని దించేందుకు విమానాలెక్కి కుట్రలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కాపురం చేశాడని విమర్శించారు. 

ఆ సమయంలో నరేంద్రమోదీ వంటి నాయకుడు ప్రపంచంలో లేడు అంటూ కితాబు ఇచ్చాడని అసెంబ్లీలో ఆయన్ను పొగుడుతూ తీర్మానం కూడా చేస్తారంటూ విమర్శించారు. చిలక గోరింకలు సిగ్గుపడేలా చంద్రబాబు మోదీలు సంసారం చేసి ఇప్పుడు విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు. 

నాలుగేళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని గ్రహించిన చంద్రబాబు కేంద్రంలో ఉన్న బీజేపీకి విడాకులు ఇచ్చాడని విమర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నాడంటూ దుయ్యబుట్టారు. 

ఒకప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అని సోనియా గాంధీ అవినీతి అనకొండ అంటూ విమర్శించిన అంశాలను గుర్తుకు తెచ్చారు. ఆనాడు అవినీతి అనకొండ నేడు అందాల కొండ, ఆనందాల కొండ అయిపోయిందా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఆనాడు గాడ్సే అన్నావ్ ఆమె నేడు దేవత అయిపోయిందా అంటూ నిలదీశారు. 

ఆ రోజు రాహుల్ గాంధీ మెుద్దబ్బాయ్ అన్న చంద్రబాబు ఈరోజు రాహుల్ గాంధీ మేధావి అంటుకొనియాడుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు పొత్తులు చూస్తుంటే విశ్వసనీయతకు ఎలా తిలోదకాలు ఇస్తున్నారో అర్థమవుతుందన్నారు. అధికారం కోసం ఎవరితోనైనా కలిసిపోతారంటూ విమర్శించారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 8 జూన్ 2018 చంద్రబాబు అవినీతిపై ఒక పుస్తకం విడుదల చేసినట్లు జగన్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో చంద్రబాబు పాలన, అవినీతిపై మోదీతో ఛార్జీషీట్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారని చెప్పారు. 

అంతేకాదు చంద్రబాబు పాలన దుష్టపాలన అంటూ విమర్శించారని గుర్తు చేశారు. అలాంటి నేతలు ఇద్దరూ తెలంగాణ ఎన్నికల్లో ఒక స్టేజ్ పై మాట్లాడటం సిగ్గుగా లేదా అంటూ నిలదీశారు. సిగ్గు, ఎగ్గూ లేని నేతలు చంద్రబాబు, రాహుల్ గాంధీలంటూ విమర్శించారు. 

ఆగష్టు 29 నందమూరి హరికృష్ణ చనిపోయారని ఆ హరికృష్ణ భౌతిక కాయం దగ్గర టీఆర్ఎస్ నేత కేటీఆర్ తో టీఆర్ఎస్, టీడీపీతో కలిసి పనిచెయ్యాలని కోరడం నిజం కాదా అని నిలదీశారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనను కేటీఆర్ తిరస్కరించినట్లు గుర్తు చేశారు. 

ఇద్దరం కలిసి పనిచేసే అవకాశం ఉండదని తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు. అదే విషయాన్ని కేటీఆర్ ప్రతీ మీటింగ్ లో చెప్తున్నారని తెలిపారు. కేటీఆర్ తిరస్కరించిన నెలరోజులు  కాకముందే  కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు డీల్ కుదుర్చకున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి సొమ్ము తెలంగాణ ఎన్నికలకు ఉపయోగపడుతుందని సిగ్గు లేకుండా కాంగ్రెస్ కలిసిపోయిందని దుయ్యబుట్టారు.

ఒకవేళ చంద్రబాబు ప్రపోజల్ ను కేటీఆర్ ఒకే చెప్పి ఉంటే నేడు కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఉంటావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఇటువంటి అనైతికమైన విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తూ చక్రం తిప్పుతా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు రాష్ట్రమంత్రి టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ నైతిక విలువలు లేని వ్యక్తి అని జగన్ ఆరోపించారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటికి సమీపంలో ఉండే కళా వెంకట్రావ్ పని నిత్యం జోగులను ప్రలోభ పెట్టడమే అని ధ్వజమెత్తారు. కంబాల జోగులకు రూ.20 కోట్లు ఇస్తా టీడీపీలోకి వచ్చెయ్యాలంటూ ఎంతో ప్రలోభాలు పెట్టారని చెప్పారు. 

రాష్ట్రంలో ఇలాంటి విలువలు లేని రాజకీయ నాయకులు జిల్లాలో కూడా ఉండటం సిగ్గు చేటన్నారు. అన్యాయమైన రాజకీయాల్లో కంబాల జోగులు ఒక తులసి మెుక్క అంటూ ప్రశంసలు కురిపించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని కంబాల జోగులకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని వైఎస్ జగన్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios