కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రాయవరం ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ విద్యార్ధినికి  క్లాస్ రూమ్ లోనే ఓ యువకుడు తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అదే క్లాస్ లో ఉన్న విద్యార్ధిని సోదరుడు అడ్డుకోవడంతో అతను పారిపోయాడు.

ఓ విద్యార్ధినిపై కన్నేసిన సత్తిరెడ్డి అనే యువకుడు క్లాస్ రూమ్ లోకి దూరి ఆ విద్యార్ధినికి తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అదే క్లాస్ లో ఉన్న ఆమె సోదరుడు ఆ యువకుడిని అడ్డుకొన్నాడు. దీంతో ఆ యువకుడు క్లాస్ రూమ్ నుండి పారిపోయాడు.

అనంతరం ఇంటికి చేరుకొన్న సత్తిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. 

బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

రాజమండ్రిలో ఇటీవలనే కాలేజీ క్లాస్ రూమ్ లో ఇంటర్ విద్యార్ధిని మెడలో ఓ సహచర విద్యార్ధి తాళి కట్టాడు. ఈ  వీడియో వైరల్ గా మారింది. వీడియో కు ఎక్కువ వ్యూస్ కోసం ఇలా తాళి కట్టినట్టుగా  ఆ యువకుడు చెప్పిన విషయం తెలిసిందే.