సారాంశం

సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత కారు ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాాయాలపాలయ్యాడు. 

తిరుపతి : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.తిరుపతి జిల్లా వరదయ్యపాలెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే కారు బైక్ ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన యువకుడు గాయపడ్డాడు. 

టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత వరదయ్యపాలెం వైపునుండి సత్యవేడు వెళుతుండగా ప్రమాదం జరిగింది.  తడ-శ్రీకాళహస్తి ప్రధాన రోడ్డులో వేగంగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే కారు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న సురేష్ అనే యువకుడు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.  

ప్రమాదం జరిగిన తర్వాత సురేష్ ను కనీసం పట్టించుకోకుండా హేమలత వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో స్థానికులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయాలతో పడివున్న సురేష్ ను వదరయ్యపాలెంకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. 

Read More  తెనాలిలో దారుణం... మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం

అయితే ఈ ప్రమాదం గురించి బయటపడకుండా మాజీ ఎమ్మెల్యే వర్గీయులు బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. వైద్య ఖర్చులకు రూ.3 వేలు ఇచ్చిన టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బాధిత కుటుంబాన్ని కోరినట్లుగా సమాచారం. మేస్త్రీగా పనిచేస్తూ తమను పోషిస్తున్న సురేష్ ఇలా గాయాలతో హాస్పిటల్ పాలవడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.