సారాంశం
అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ కాామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తెనాలిలో వెలుగుచూసింది.
తెనాలి : గుంటూరు జిల్లాలో ఓ కామాంధులు అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాయమాటలతో మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాడి వికృత చేష్టలతో భయపడిపోయిన యువతి కుటుంబసభ్యులకు విషయం తెలిపింది.
తెనాలి పట్టణానికి చెందిన కొప్పుల రాజు ఓ మైనర్ బాలిక(14)పై కన్నేసాడు. ఈ క్రమంలోనే బాలిక ఒంటరిగా కనిపించడంతో మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఈ విషయం బయటపెట్టొద్దంటూ బాలికను బెదిరించాడు.
Read More హాస్పిటల్ లో చేరిన అన్నకు తోడుగా వచ్చిన ఇంటర్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం.. మన్యం జిల్లాలో ఘటన
కానీ బాలిక మాత్రం తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని తమ బిడ్డపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు.