విజయనగరం: పశువులు కాస్తున్న మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఆ యువతి మాత్రమే పశువులు కాస్తుండటాన్ని గమనించిన ఆ ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం విజయనగరం జిల్లా గుర్ల మండలం కోర్ణాలపేటలో చోటు చేసుకుంది. 

కోర్ణాలపేటకు చెందిన మైనర్ బాలిక ఈనెల 18న తన పొలంలో పశువులు కాస్తుంది. మైనర్ బాలిక ఒంటరిగా పశువులు కాస్తున్న విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ఆనంద్, నాగరాజు అనే ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది మైనర్ బాలిక. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలిను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పోలీసులు కేసు నమోదవ్వడంతో రాజీ చేసేందుకు ప్రయత్నించారు గ్రామపెద్దలు. ఇరువర్గాలు మధ్య రాజీ జరగలేదు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు.