కొత్త సంవత్సరం వేళ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూసపాటిరేగ మండలం ఎరుకొండలో ఈ ఘటన జరిగింది. 

విజయనగరం జిల్లాలో జరిగిన కబడ్డీ ఆటలో అపశృతి చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం ఎరుకొండలో కబడ్డీ ఆడుతూ.. రమణ అనే క్రీడాకారుడు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. కూతకొచ్చిన రమణపై ప్రత్యర్ధి జట్టు ఒక్కసారిగా మీద పడటంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నిర్వాహకులు వెంటనే రమణను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ రమణ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.