గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 2 లక్షలు లంచం తీసుకొన్నాడని అంతేకాదు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా  ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం సుచరితకు ఫిర్యాదు చేసింది.

గుంటూరు డిఎప్ఓ మోహన్ రావుపై  మహిళ ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై విచారణ జరిపి  న్యాయం చేస్తామని  హామీ ఇచ్చినట్టు బాధితురాలు చెప్పారు. గుంటూరు డిఎప్ఓ మోహన్ రావు తనకు క్లర్క్ ఉద్యోగం ఇస్తానని చెప్పి తన వద్ద నుండి రూ. 2 లక్షలు లంచం తీసుకొన్నాడని బాధితురాలు చెప్పారు.

అంతేకాదు తనపై డిఎఫ్ఓ లైంగిక దాడికి కూడ పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే  ఈ ఆరోపణలను డీఎప్ఓ మోహన్ రావు కొట్టిపారేశారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని ఆయన చెప్పారు.  తనపై ఎందుకు ఆమె ఆరోపణలు చేస్తోందో తెలియదన్నారు.ఈ విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దంగానే ఉన్నానని ఆయన ప్రకటించారు.