ప్రకాశం బ్యారేజి సమీపంలోని సీతమ్మ వారి పాదాలు వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని పోలీసులు కాపాడారు.  

విజయవాడ: కృష్ణా నది తీరంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విజయవాడ సమీపంలో చోటుచేసుకుంది. ప్రకాశం బ్యారేజి సమీపంలోని సీతమ్మ వారి పాదాలు వద్ద యువతి తీవ్ర రక్తస్రావంతో వుండటాన్ని గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి బ్లేడ్ తో చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న యువతిని పోలీసులు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం యువతికి ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. యువతి కోలుకున్నాకే ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలిసే అవకాశం వుంది.

read more కూతురు లవ్ మ్యారేజ్: గన్నవరంలో తల్లి ఆత్మహత్య

ఇదిలావుంటే ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దుండగులు దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నదీ తీరంవెంట పర్యాటకులు, ప్రజలు వచ్చే ప్రాంతాల్లో బందోబస్తును పెంచడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే యువతి ఆత్మహత్యాయత్నం బయటపడింది.